మా స‌భ్య‌త్వానికి నాగ‌బాబు రాజీనామా

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌త కొద్ది రోజులుగా `మా` ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో హ‌డావిడి నెల‌కొంది. ఇండ‌స్ట్రీలో మా ఎన్నిక‌ల పేరుతో ఒక‌రిపై ఒక‌రు మాట‌ల దాడి చేసుకోవ‌డంతో మీడియాలో ఎవ‌రో ఒక‌రు నిత్యం చ‌ర్చ‌నీయాంశంగా మారారు. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించ‌డంతో మా ఎల‌క్ష‌న్స్‌కి తెర‌ప‌డింది. ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణుతో పాటు ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు.

ఎన్నిక‌లు మొద‌లైన నాటి నుండి ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ కి స‌పోర్ట్‌గా నిలుస్తూ వ‌చ్చిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. `మా` ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు నాగ‌బాబు ప్ర‌క‌టించారు. విష్ణు గెలిచిన కొద్దిసేప‌టికే ఈ నిర్ణ‌యం తీసుకొని ఒక్క‌సారిగా షాక్ ఇచ్చారు.
ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మా ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

48 గంటల్లో తన స్టాఫ్ ద్వారా తన రాజీనామా ను మా అసోసియేషన్ కి పంపుతాను అని తెలిపారు. ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్న నిర్ణయం అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.