Nagarjuna Sagar: ప్ర‌జ‌లంద‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు: ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర స‌మితి అభ్యర్థి నోముల భగ‌త్‌కు ఆశీర్వచనమిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం తెలిపారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం స్పష్టం చేశారు. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టీఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సీఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.