ఒమిక్రాన్‌కు భయపడాల్సిన అవసరంలేదు: డిహెచ్ శ్రీనివాసరావు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ (CLiC2NEWS): కొవిడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్‌రావు స్పష్టంచేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రజలలో భయాందోళనల నెలకొన్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డెల్టావేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వీటిలో మూడొంతులు ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని తెలిపారు. విదేశాలనుండి వచ్చే ప్రయాణికులకు విమానశ్రయాలలో పరీక్షలు నిర్వహిస్తున్నాం, 900మందికి పైగా విదేశాల నుండి రాగా అందులో 13 మందికి మాత్రమే కొవిడ్ నిర్థారణ అయ్యిందని తెలిపారు. కాగా వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అనే విషయం రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు.
ఒకట్రెండు నెలల్లో భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశం ఉంది, ఇప్పటి వరకు దేశంలో 5 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తప్పకుండా నిబంధనలు పాటించాలి, పండుగలలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ సోకితే ఎక్కవ లక్షణాలేవి కనిపించడంలేదు, ఒళ్లు నొప్పులు ,తలనొప్పి నీరసంగా ఉంటుందని తెలిపారు.