మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా కంభంపాటి హ‌రిబాబు

8 రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం.. ద‌త్తాత్రేయ‌ బ‌దిలీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): ప‌లు రాష్ట్రాల‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్లు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు రాష్ట్రప‌తి కార్యాల‌యం మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీనియ‌ర్ నేత కంభంపాటి హ‌రిబాబును మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌క‌టించారు. మొత్తం 8 రాష్ట్రాలకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది. ఈ ఎనిమిది మందిలో న‌లుగురు కొత్త వారు కాగా, మిగిలిన న‌లుగురు బ‌దిలీ అయ్యారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న బండారు ద‌త్తాత్రేయను హ‌ర్యానాకు బ‌దిలీ అయ్యారు. మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న పీఎస్ శ్రీధ‌ర‌న్ పిళ్లై గోవా గ‌వ‌ర్న‌ర్‌గా, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న స‌త్య‌దేవ్ నారాయ‌ణ్ త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా, త్రిపుర గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌మేశ్ బైస్ జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియామ‌కం అయ్యారు.

గ‌వ‌ర్న‌ర్లు.. వివ‌రాలు..

  1. మిజోరం గ‌వ‌ర్న‌ర్ – కంభంపాటి హ‌రిబాబు
  2. హ‌రియాణా – బండారు ద‌త్తాత్రేయ‌
  3. క‌ర్ణాట‌క గ‌వ‌ర్న‌ర్ – థావ‌ర్ చంద్ గెహ్లాట్
  4. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ – మంగూభాయ్ ప‌టేల్
  5. గోవా – పిఎస్ శ్రీ‌ధ‌ర‌న్ పిళ్లై
  6. త్రిపుర – స‌త్య‌దేవ్ నారాయ‌ణ్‌
  7. ఝార్ఖండ్ – ర‌మేశ్ బైస్‌
  8. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ – రాజేంద్ర విశ్వ‌నాథ్
Leave A Reply

Your email address will not be published.