భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌దే: సిఎం రేవంత్ రెడ్డి
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/new-microsoft-campus-inauguration.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన మైక్రోసాప్ట్ క్యాంపస్‌ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు ఐటి మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాప్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందని.. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) దే నని సిఎం అన్నారు. మైక్రోసాప్ట్ కృషిలో 500 పాఠశాలల్లో ఎఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతుందని.. మైక్రోసాప్ట్ విస్తరణ ద్వారా రాష్ట్రంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని సిఎం తెలిపారు. ఈ సందర్బంగా నగరంలో ఎఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.