ఈ నెలలో అందుబాటులోకి రానున్న కొత్త మోటార్ సైకిళ్లు..

Royal Enfield : మార్చి నెలలో కొత్త మోటార్ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. బెల్లెట్‌తో పాటు ఓ అడ్వెంచర్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650.. ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డిజైన్ మాదిరిగానే ఉండి.. 647 సిసి ఇంజిన్‌తో బ్లాక్ క్రోమ్, బ్లంటింగ్ థోర్ప్ బ్లు, వల్లమ్ రెడ్, టీల్ వంటి డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో ఈ మోటార్ సైకిల్ అందుబాటులోకి రానుంది.
అపాచి ఆర్‌టిఎక్స్.. స్పోర్టి లుక్‌లో కనిపించే అపాచి బైక్ అడ్వెంచర్ లుక్‌లో రాబోతుంది. టివిఎస్ మోటార్ నుండి వస్తున్న తొలి అడ్వెంచర్ బైక్ ఇది. అపాచి అర్‌టిఎక్స్ 300 పేరుతో ఇది రాబోతున్నట్లు సమాచారం.
బజాజ్ చేతక్ .. గత ఏడాది డిసెంబర్ నెలలో చేతక్.. 2 స్కూటర్లను లాంచ్ చేసింది. ఈ నెలలో మరో స్కూటర్‌ను అందుబాటులోకి తెస్తుంది.
హీరో కరిజ్మా.. హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 మార్చి నెలలో రానుంది. ఇది పాత ఎక్స్ ఎంఆర్ కంటే డిజైన్‌లోనూ.. లుక్ పరంగా మార్పులు చేసినట్లు సమాచారం.