TS: 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి కెటిఆర్

రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): జిల్లాలోని గంభీరావుపేట మండలం రాజపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు.
70 ఏండ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేండ్లలో చేసి చూపించామని మంత్రి తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్నారు. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు కనీసం ఒక మొక్క నాటి పెంచాలని సూచించారు. రాజుపేటలో మహిళా సంఘం భవనం నిర్మిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల, గంభీరావుపేట మండలం రాజుపేటలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. #PallePragathi pic.twitter.com/ewpdTxQecD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 1, 2021