1/70 చట్టాన్ని మార్చే ఉద్ధేశం లేదు: సిఎం చంద్రబాబు
తప్పుడు ప్రచారాలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు
![](https://clic2news.com/wp-content/uploads/2025/01/cm-chandrababu.jpg)
అమరావతి (CLiC2NEWS): గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోంస ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తప్పడు ప్రచారాలు, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనుల సోదరలను కోరుతున్నానన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై వారికే హక్కు ఉండాలనే ఉద్దేశంతో వచ్చిన 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని సిఎం స్పష్టం చేశారు. పాడేరు లో గిరిజనులు చేపట్టిన నిరసన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో జిఒ నంబర్ 3 తీసుకురావడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకే దక్కేలా కృషి చేశామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వులు రద్దయ్యాయని అన్నారు. దాని పునరుద్ధరణకు మేం కృషి చేస్తామని తెలిపారు. అరకు కాఫీ సహా ఇతర గిరిజన ఉత్తత్తులను అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానకి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. గిరిజనుల విద్య, వైద్యం , జీవన ప్రమాణాలను మెరుగు పరచేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. వారి హక్కులను కాపాడతుందని తెలిపారు.