తెలంగాణ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఆయన వెంట ఉన్నారు. బిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజి మంత్రి కెటిఆర్ కూడా ఆయన వెంటే ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిసత్ఊ నామినేషన్ పత్రాలపై కెటిఆర్ సంతకం చేశారు. రేపు ఉదయం శాసనసభలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.