రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల గడువు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో శాసనసభ ఎన్నికల నేమినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్ కార్యాలయాలకు వెళ్లి లైన్లో ఉన్న అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు అనుమతించారు. శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 వరకు ఉంటుంది. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది.