తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

హైదరాబాద్(CLiC2NEWS) : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. అదిలాబాద్ , వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానాలకు, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డిజిల్లాల్లో రెండేసి స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనున్నందున ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నెల 23 వ తేది వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది నవంబరు 26. డిసెంబర్ 10వ తేదీనపోలింగ్ ఉంటుంది. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.