వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి అనుబంధంగా తాజాగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. నర్సింగ్ పోస్టులు 2,050 ఉండగా.. అదనంగా 272 పోస్టులను జతచేసింది. అదేవిధంగా 633 ఫార్మసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలిపి తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
అక్టోబర్ 14వ తేదీ లోపు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. నవంబర్ 17వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఫార్మసిస్ట్ పోస్టులకు అక్టోబర్ 21న దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 30న పరీక్ష నిర్వహించునున్నట్లు బోర్డు వెల్లడించింది.