కాళోజి హెల్త్ యూనివర్సిటీలో పిజి ప్రవేశాలకు నోటిఫికేషన్
Notification for PG Admissions in College Health University

హైదరాబాద్(CLiC2NEWS): కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటి పోస్ట్ గ్రడ్యుయేట్ మెడికల్ డిగ్రి, డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేసింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 20 న ఉదయం 8 గంటలనుండి 27వ తీదీ సాయంత్రం వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. నీట్ -2021 కాటాఫ్ స్కోర్ ఆధారంగా పిజి ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసేటపుడు అవసరమైన సర్టిఫికెట్‌లను, సంతకం చేసి ఉన్నపాస్‌పోర్ట్ సైజు ఫోటో అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తులను https://tspgmed.tsche.in వెబసైట్ లో నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 93460-18821/ 7842542216 నంబర్లను సంప్రదించగలరు.