తెలుగు రాష్ట్రాలకు ఎన్‌టిఆర్ భారీ విరాళం

హైదరాబాద్ (CLiC2NEWS): రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్‌టిఆర్ రెండు రాష్ట్రాల సిఎం సహాయనిధికి చెరొక రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విపత్తు నుండి ప్రజలంతా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతి కి ప్రజలు జలదిగ్భంధంలో ఉండిపోయారు. వారికి ఆహారం, నీరు సరఫరా చేస్తున్నారు. పడవల సాయంతో నీటిలో ఉండి పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు రోజులుగా ఆహారం లేక వరద నీటిలోనే ఉండిపోవాల్సి వచ్చిందంటూ ప్రజలు వాపోతున్నారు.