ఎన్‌టిఆర్ ‘దేవర’ కొత్త ట్రైలర్..

హైదరాబాద్ (CLiC2NEWS): ‘దేవర’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి కొత్త ట్రైలర్ విడుదలైంది. జాన్వి, ఎన్‌టిఆర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. దేవర రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.