న‌ర్సుల ధ‌ర్నా.. నిమ్స్‌లో నిలిచిన ఎమ‌ర్జెన్సీ స‌ర్జ‌రీలు!

హైద‌రాబాద్ (CLiC2NEWS): రోజువారీ విధుల‌కు స‌రిగ్గా హాజ‌రు కావ‌డంల లేదంటూ ప‌లువురికి ఇటీవ‌ల నిమ్స్ డైరెక్ట‌ర్ బీరప్ప మెమోలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆసుప‌త్రిలో న‌ర్సులు ద‌ర్నాకు దిగారు. ఈ నేప‌థ్యంలో న‌ర్సులు విధుల‌ను బ‌హిష్క‌రించి ఆందోళ‌న చేపట్టారు. ఈ ఆందోళ‌న‌తో ఆసుప‌త్రిలో ఎలెక్టివ్ స‌ర్జ‌రీలు నిలిచిపోయాయి. ఎమ‌ర్జెన్సీ స‌ర్జ‌రీల‌కు సైతం ఆటంకం ఏర్ప‌డింది. ఈ ధ‌ర్నాతో రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో దీనిపై ఏర్పాటు చేసిన త్రిస‌భ్య క‌మిటీతో నిమ్స్ డైరెక్ట‌ర్ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో తిస‌భ్య‌క‌మిటీతో చ‌ర్చ‌ల‌కు న‌ర్సింగ్ సిబ్బంది నిరాక‌రించారు. త‌క్ష‌ణ‌మే మెమోల‌ను వెన‌క్కి తీసుకుంటేనే విధుల‌కు హాజ‌ర‌వుతామ‌ని న‌ర్సులు స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.