భైరవి కారెక్టర్ చేయడం నా అదృష్టం.. తమన్నా

హైదరాబాద్ (CLiC2NEWS): అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల2 రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో తమన్నా కీలక పాత్రలో నటించారు. నగరంలో శనివారం చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా తమన్నా మాట్లాడుతూ.. నేను ఏ సినిమా చేసినా ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతి పంచాలని కోరుకుంటానని.. ఇది కూడా అలాంటిదే నన్నారు. సంపత్ నంది ఓదెల 2 చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించిందని.. ఇది రొటీన్ జానర్ కాదన్నారు. భైరవి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం అన్నారు. నేను శివశక్తి పాత్ర ఎందుకు చూయకూడదని ప్రశ్నించారు. మిల్కిబ్యూటి అనే ట్యాగ్ ఉన్నంత మాత్రాన ఇలాంటి పాత్రలు చేయకూడదని లేదుగా.. దర్శకుడు నాలో మిల్కిబ్యూటిని చూడలేదు. దైవత్వం, రౌద్రం, శక్తి .. ఇలా మహిళ అంటే అనేక అంశాల కలయిక అని తమన్నా తెలిపారు.
దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ప్రేక్షకులకు కొత్త రకం స్టోరీ చెప్పాలని ఓదెల 2 కథ రాసుకున్నానన్నారు. తమన్నా ఒప్పుకోకపోతే , ఈ సినిమా చేసేవాడినే కాదన్నారు. సూపర్ స్టార్ కోసం మాత్రమే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తాయని.. అందుకే ఈ పాత్ర అనుకున్న తర్వాత తమన్నా దగ్గరకు వెళ్లిందన్నారు. శివ శక్తిగా బరువైన కాస్ట్యూమ్స్ ధరించి, మండుటెండలో చెప్పుల్లేకుండా నడిచిందని తెలిపారు.