Olympic Games: తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం

టోక్యో (CLiC2NEWS): టోక్యో ఒలింపిక్స్ లో తెలుగు తేజం, భార‌త స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో (బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌) ఇజ్రాయిల్‌ షట్లర్ సెనియా ఫోలిక‌ర్పోవాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో వరుస గేమ్స్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ షెట్లర్ సింధుకు పొలికర్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. దీంతో సింధు 21-7, 21-10తో ఘ‌న విజయం సాధించింది.

Leave A Reply

Your email address will not be published.