భారత్‌లో 57కి చేరిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు

ముంబయి(CLiC2NEWS): దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో నాలుగు,రాజస్థాన్‌లో నాలుగు, మహారాష్ట్రలో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నిర్థారణయ్యాయి. వీరందరీ ఎవ్వరూ కూడా విదేశాలనుండి వచ్చిన వారు కాదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలపి దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 57కు చేరింది. ఒక మహారాష్ట్రలోనే ఈ సంఖ్య 28కి చేరింది. తాజాగా ఈ వేరియంట్ సోకిన వారందరూ 24 నుండి 41 వయస్సు వారే.