ఊ… అంటావా మావ.. ఊఊ.. అంటావా..
`పుష్ప`లో సమంత ఐటమ్ సాంగ్..

ఊ… అంటావా మావ.. ఊఊ.. అంటావా.. అంలూ సాగే పాటకు సంబంధించిన లరికల్ వీడియోను `పుష్ప` చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఈ పాటలో సమంత హాట్ హాట్‌గా కనిపించనుంది. అమ్మాయిల విషయంలో మగాళ్ల వంకర బుద్ధి గురించి కొనసాగే ఈ పాటలో సమంత అందం.. అభినయం.. డాన్స్ చక్కగా కుదిరాయి. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించాడు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ `పుష్ప`. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ నెల 12న పుష్ప ప్రీరిలీజ్ పార్టీని హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.