పండ్లు అమ్ముకుంటూ.. పాఠశాల నిర్మించిన వ్యాపారికి పద్మశ్రీ అవార్డు

న్యూఢిల్లీ (CLiC2NEWS): మంగళూరు వీధుల్లో బత్తాయి పండ్లు అమ్ముకునే వ్యక్తి.. ఇవాళ (సోమవారం) రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షకనగా నిలిచారు.
ఆర్ధికంగా నిరుపేద అయిన హజబ్బ బత్తాయి పండ్లు అమ్మగా వచ్చిన సంపాదనతో స్కూల్ నిర్మించి సాయంలో శ్రీమంతుడైనాడు.. చదువు విలువ తెలిసినవాడు కాబట్టి పండ్లు అమ్మిన సంపాదనతో విద్యార్థులకోసం పాఠశాల కట్టించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అందుకే పద్మశ్రీ లాంటి గొప్ప పురస్కారం ఆయన్ను వరించింది.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారి హరేకల హజబ్బ (68) పద్మశీ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం అందుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తాను చదువుకోలేదని హరేకల హజబ్బ తెలిపారు. దీంతో తమ గ్రామంలోని ప్రతి చిన్నారి చదువుకోవాలన్న ఉద్దేశంతో తన సంపాదనతో పాఠశాలను నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఆ స్కూల్లో ప్రస్తుతం 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులు చదువుతున్నారని హరేకల హాజబ్బ వివరించారు.
హరేకల హజబ్బ నేపథ్యం…
హరేకల హజబ్బ ది దక్షిణ కన్నడ జిల్లాలోని మంగుళూరు తాలుకా న్యూపడపు గ్రామం. హజబ్బ నిరక్షరాస్యుడు.. స్థానికంగా ఆయన బత్తాయి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈక్రమంలో ఒకసారి ఒ విదేశీయుడు హరేకల వద్దకు వచ్చి ఇంగ్లీషులో పండ్లు ధర ఎంత అని అడిగాడు.. దాని హజబ్బ కన్నడంలో సమాధానం చెప్పాడు.. అది వారికి అర్థం కాక వారు పండ్లు కొనకుండానే వెళ్లిపోయారు. దీంతో హజబ్బ ఎంతో మధనపపడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఎవరి రాకూడదని.. నిర్ణయించుకుని ఆ క్షణం నుంచి సంపాదించిన దాంట్లో కొంత డబ్బు వెనకేయడం మొదలు పెట్టాడు. చివరకు ఆ డబ్బుతో పాటు మరికొంత డబ్బును విరారాళ రూపంలో సేకరించి ఒక పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ ఆ పాఠశాల ఆవరణను హజబ్బ శుభ్రం చేస్తారు.