ఐశ్వర్యారాయ్‌కి ఇడి నోటీసులు

ముంబయి (CLiC2NEWS): ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టివంచిన పనామా పేపర్ లీక్ కేసులో అమితాబచ్చన్ కుటుంబానికి సమస్యలు అంతకంతకీ పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటి కే అభిషేక్ బచ్చన్ విచారించిన ఇడి తాజాగా ఆయన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం ఇవాళ (సోమవారం) న్యూఢిల్లీలోని ఇడి ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
కాగా ఐశ్వర్యకు గత నెలలోనే విచారణ కోసం ఇడి సమన్లు జారీ చేయగా.. దీనిపై ఆమె వాయిదా కోరింది. . ఇవాళ ఢిల్లీ లో విచారణ కు ఐశ్వర్య హాజరయ్యారు.