ఒకే సెట్‌లో బాలకృష్ణ, పవన్‌కల్యాణ్.. సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/pawan-kalyan-and-balakrishna.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అన్నపూర్ణ స్టూడియోలో నందమూరి బాలకృష్ణతో జనసేనాని పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. శుక్రవారం స్టూడియోలో ఇద్దరి సినిమాల షూటింగ్స్ జరిగాయి. షూటింగ్ గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్ కలిసి మాట్లాడుకున్నారు.
ఇక బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న అన్‌స్టాపబుల్ షోకి పవన్ కల్యాణ్ గెస్ట్‌గా రానున్నారు. ఆ షూటింగ్‌కు ముందే వీరిద్దరి సమావేశ మవడం.. అటు సినీ అభిమానులలోనూ, ఇటు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.