చిన్నారి కుటుంబానికి పవన్​కల్యాణ్​ పరామర్శ

హైదరాబాద్‌ (CLiC2NEWS):  సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక‌పై దారుణం నా హృదయాన్ని కలిచివేసింది జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చారు. తానున్నానని ధైర్యం చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితునికి శిక్ష పడే వరకు పోరాడతానని ప‌వ‌న్ భరోసా ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ.. చిన్నారిపై దారుణం నా హృదయాన్ని కలిచివేసిందన్న‌రు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌న్నారు. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఓదార్పు అవసరం… దోషికి శిక్ష పడేవరకు జనసేన పోరాడుతుందని స్ప‌ష్టం చేశారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్​కల్యాణ్​ వస్తున్నాడని తెలిసి.. పెద్దఎత్తున అభిమానులు సింగరేణి కాలనీకి చేరుకున్నారు. సింగరేణి కాలనీకి పవన్​ చేరుకోగానే.. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల రద్దీ వల్ల కారు దిగలేక పవన్‌ ఇబ్బంది పడ్డారు. అభిమానుల తోపులాటలో ఓ స్థానికుడి కారు కూడా ధ్వంసమైంది. కారు దగ్గరికే చిన్నారి తండ్రిని పిలిపించుకుని ప‌వ‌న్ వారిని ఓదార్చారు.

Leave A Reply

Your email address will not be published.