PawanKalyan: కరోనా నుంచి కోలుకున్న పవన్

హైద‌రాబాద్ (CLiC2NEWS): జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ న‌టుడు ప‌వన్ క‌ల్యాణ్ క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇటీవ‌ల కొవిడ్ బారిన ప‌డిన ఆయ‌న ప్ర‌స్తుతం కోల‌కున్నార‌ని తెలియ‌జేస్తూ శ‌నివారం జ‌న‌సే పార్టీ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

`జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కోల‌కున్నారు. 3 రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ ప‌రీక్ష‌ల్లో నెగెటీవ్ నిర్ధార‌ణ అయింది. కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే తన ఆరోగ్యం బాగుపడాలని, క్షేమాన్ని కోరుతూ పూజలు చేసిన జనసేన సైనికులు, నాయకులకు పవన్ కృతజ్ఞతలు తెలియచేశారు. ప్ర‌స్తుతం దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య నిపుణుల‌ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.“ అని జ‌న‌సే పార్టీ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.