ద‌ళిత బంధు యూనిట్ల‌ను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల‌..

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS): తెలంగాణ దిళ‌త బంధు దేశానికే ఆద‌ర్శ‌మని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. శుక్ర‌వారం పెద్ద‌ప‌ల్లి జిల్లా వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో ద‌ళిత బంధు ప‌థ‌కం 233 మంది ల‌బ్ధిదారుల‌కు రూ. 21.85 కోట్ల విలువైన యూనిట్ల‌ను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎస్‌సి స‌బ్‌ప్లాన్ క్రింద రూ. 26.50 ల‌క్ష‌ల‌తో 53 మందికి ఒక్కొక్క‌రికి రూ. 50 వేల విలువైన కుట్టుమిష‌న్లు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ద‌ళితులు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌తో స‌మానంగా ఎదిగి ఆర్ధిక ప‌రిపుష్టిని సాధించాలనే ల‌క్ష్యంతో సిఎం కెసిఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ పుట్ట మ‌ధుక‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, రామ‌గుండం ఎమ్మెల్యేలు దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి, కోరుకంటి చంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.