Peddapally: రోడ్డు ప్రమాదంలో కమాన్‌పూర్ ASI మృతి

పెద్దపల్లి (CLiC2NEWS): పెద్దపెల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలో కమాన్ చౌరస్తా వద్ద లారీ వెనుక నుండి స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో కమాన్‌పూర్ ASIగా పని చేస్తున్న భాగ్యలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. తమ నివాసం నుంచి కూతురుతో కలిసి బస్టాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో భాగ్యలక్ష్మి పై నుంచి వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడింది. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
