గవర్నర్‌కు టిఆర్ఎస్ నేతల వినతిపత్రం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలో గవర్నర్ కు మంత్రుల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలోమంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.
👌