ఆగని పెట్రో మంట

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్80 పైసల వంతున దరను పెంచారు. వీటికి డీలర్ కమిషన్, వ్యాట్ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు దర 91 పైసలు, డీజిల్ దర 87 పైసలు పెరిగింది. పెరిగి ధరలతో హైదరాబాద్ నగరంలో పెట్రోలు లీటరు దర 118.59.. లీటరు డీజిలు రూ. 104.62కి చేరింది.
గత మార్చి 22 తర్వాత ఒకటి రెండు రోజులు మినహా వరుసగా చమురు దరలు పెరుగూ వస్తున్నాయి. దీంతో సామాన్యుడు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటే వణికిపోతున్నారు.