డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలు నమ్మకం ఉంచారు: ప్రధాని మోడీ
ఇకనుండి ఢిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్..
![](https://clic2news.com/wp-content/uploads/2024/08/Prime-Minister-Modi.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ప్రజలు మాపై నమ్మకం ఉంచినందుకు రుణం తీర్చుకుంటానని , ఢిల్లీని వికసిత్ రాజధానిగా మర్చే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీ ఢిల్లీ వాసులకు కృతజ్ఞతలు తెలపారు. దేశ రాజధాని ఢిల్లీలో కమలదళం విజయ పతాకం ఎగురవేసింది. ఈ సందర్బంగా పార్టీ ప్రధాన కార్యలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్నపార్టికి ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు. పదేళ్ల కష్టాలు, సమస్యలు నుండి ఢిల్లీకి విముక్తి లభించిందని.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై నమ్మకం ఉంచి బిజెపికి ఘన విజయం అందించిన ప్రజల కోసం పగలు, రాత్రి పనిచేస్తామన్నారు. హరియాణా , మహారాష్ట్రలో కూడా గొప్ప విజయం సాధించామని , ఢిల్లీలో గెలిచామంటే దేశమంతా బిజెపిని దీవించినట్లేనన్నారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని మోడీ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టి కొత్త తరాన్ని రానీయడం లేదని.. వికసిత్ భారత్ కోసం యువతకు పెద్దపీట వేస్తామన్నారు. బిజెపి ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కొత్త ఎత్తులు వేసిందన్నారు. అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నేటి తరం ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా మా పాలన ఉంటుందని.. ప్రజలకు సవే చేసేందుకు, అండగా ఉండేందుకే రాజకీయాల్లోకీ వచ్చామని, సుఖం..ఆశించి కాదని బిజెపి విజయోత్సవ సభలో ప్రధాని మోడీ అన్నారు.