ఆదిలాబాద్లో పోలీసు తనిఖీలు.. భారీగా వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్ (CLiC2NEWS) :జిల్లా కేంద్రంలో తాటిగుడా కాలనీలో ఇవాళ (శుక్రవారం) ఉదయం 5 గంటల డిఎస్పీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు 03, కార్లు 04 ఆటోలు. విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాలనీలో బెల్టుషాపు, నిషేధిత గుట్కా ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్న బండారి మల్లేష్ (55) ను అదుపులో తీసుకొని అతని వద్ద రూ.25 వేల విలువైన లిక్కర్ బాటిల్స్, రూ 5 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.