రూ. 1400 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయోషన్ చేసి డ్రగ్స్ తయారీ..
ముంబయి (CLiC2NEWS): కెమిస్ట్రీలో పిజి చేసి మందుల తయారీ ముసుగులో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలో ముంబయి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలో 700 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను ముంబయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాల్ఘర్ జిల్లా నాలా సొపారా ప్రాంతంలో మందుల తయారీ యూనిట్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు యాంటీ నార్కోటిక్స్ విభాగం పోలీసులు అకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ యూనిట్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. సుమారు 700 కిలోలకు పైగా మెఫిడ్రోన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1400 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. నిందితుడు ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిజి చేశాడు. ఆ నైపుణ్యాలతోనే డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అతని నుండి సేకరించిన వివరాలతో మరో నలుగురిని అరెస్టు చేశారు.