ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్‌లో ట్రెయిని పోస్టులు

ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంకు), ముంబయిలో 28 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంరర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక నిర్వహిస్తారు.
మొత్తం పోస్టులు 28
చీఫ్ మేనేజర్-1
డిప్యూటి మేనేజర్ -1
డిప్యూటి మేనేజర్ -లీగల్ -4
మేనేజ్‌మెంట్ ట్రెయిని – డిజిటల్ టెక్నాలజి – 10
మేనేజ్‌మెంట్ ట్రెయిని – రిసెర్చ్ అండ్ అనాలసిస్ -5
మేనేజ్‌మెంట్ ట్రెయిని- లీగల్ -5
మేనేజ్‌మెంట్ ట్రెయిని – రాజ్‌భాష-2
మేనేజ్‌మెంట్ ట్రెయినికి నెలకు వేతనం రూ.65వేలు..
డిప్యూటి మేనేజర్‌కు రూ. 48,480 నుండి రూ.85,920
చీఫ్ మేనేజర్‌కు రూ. 85,920 నుండి 1,05,280 వరకు వేతనం అందుతుంది.
బిఇ / బిటెక్‌లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత. ఎంసిఎ, పిజి, లా డిగ్రీ ఎంబిఎతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 28.2.2025 నాటికి 33 ఏళ్లు మించకూడదు. ఇడబ్ల్యు ఎస్/ యుఆర్‌కు 28 నుండి 40 ఏళ్లు మధ్యన ఉండాలి
దరకాస్తులను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 15 లోపు పంపించాలి. రాత పరీక్ష
మే లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ ఒబిసిలకు రూ.600. ఎస్‌సి / ఎస్‌టి/ దివ్యాంగులు/ ఇడబ్ల్యుఎస్/ మహిళలకు రూ.100గా నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.eximbankindia.in/ వెబ్‌సైట్ చూడగలరు.