హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో పోస్టులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/jobs-notification-copy-750x313.jpg)
ఆంధ్రప్రదేశ్‌లోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (హెచ్ ఎం ఎఫ్‌డబ్ల్యు )లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 66 ఖాళీలు కలవు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులను కోరుతున్నారు.
ఒటి, సి- ఆర్మ్, డయాలసిస్, అనస్థీషియా, ఎమర్జెన్సి మెడికల్, ఇఇజి, ఆడియోమెట్రి .. తదితర విభాగాల్లో ఈ క్రింది పోస్టులు కలవు
ఫిజియో థెరపిస్ట్ – 2
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 2
ల్యాబ్ అటెండెంట్ -7
లైబ్రరి అటెండెంట్ -1
జనరల్ డ్యూటి అటెండెంట్ 15
డేటా ఎంట్రి ఆపరేటర్ -3
నర్సింగ్ ఆర్డర్లి ( ఫిమేల్ / మఏల్ ) -17
ఎలక్ట్రీషియన్ / మెకానిక్ – 1
అటెండర్లు -4
మార్చురి మెకానిక్ -1
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 22వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు రుసుం రూ. 300 గా నిర్ణయించారు. ఎస్‌సి/ ఎస్‌టి / పిడబ్ల్యు బిడిలకు ఫీజు లేదు.
ప్రొవిజన్ మెరిట్ జాబితా మార్చి 7న ప్రకటిస్తారు. అభ్యంతరాలకు చివరి తేదీ మార్చి 7 గా నిర్ణయించారు. తుది మెరిట్ జాబితాను మార్చి 15న ప్రకటిస్తారు. ధ్రవపత్రాల పరిశీలన, నియామక ఉత్తర్వులు మార్చి 24న ఉంటుంది.
అర్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బిఎస్‌సి, ఎంసిఎ, పిజితో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించకూదడు. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్‌సి / ఎస్‌టిలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 15 వేల నుండి రూ. 32,670 వరకు అందుతుంది. ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని ఎస్‌బి మెడికల్ కాలేజ్, ఎస్‌విఆర్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎస్‌విఆర్ ఆర్ జిజిహెచ్, శ్రీ పద్మావతి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గవర్నమెంట్ మెటర్నిటి హాస్పిటల్ నందు పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://rirupati.ap.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు