తెలంగాణ డిప్యూటి సిఎం నివాసంగా ప్ర‌జాభ‌వ‌న్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కకు ప్ర‌జాభ‌వ‌న్‌ను నివాసంగా రాష్ట్ర స‌ర్కార్ కేటాయించింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సిఎస్) శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. రేపు గురువారం భ‌ట్టి విక్ర‌మార్క కుటుంబ స‌మేతంగా ప్ర‌జాభ‌వ‌న్‌లోకి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. మాజి సిఎం కెసిఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. దీనిని రేవంత్ రెడ్డి సిఎం కాగానే జ్యోతిరావుపూలే ప్ర‌జాభ‌వ‌న్‌గా పేరు మార్చారు.

Leave A Reply

Your email address will not be published.