‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్ రాజీనామా

హైదరాబాద్ (CLiC2NEWS): `మా` ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ఎన్నికలు సజావుగా సాగాయని తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అలాగే ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అలాంటి మా లో పని చేయడం తనకు ఇష్టం లేదని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. లోకల్, నాన్ లోకల్ అజెండా మధ్య పని చేయలేను అని ప్రకాశ్‌రాజ్ తేల్చిచెప్పారు. మా లో సభ్యత్వం లేకపోతే సినిమాల్లో అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. కళాకారుడిగా నాకు ఆత్మగౌరవం ఉందన్నారు. 21 ఏండ్లుగా మాతో అనుబంధం ఉందన్నారు.
ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది.. అందువల్ల మా ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా అని తెలిపారు. పెద్దలు నటులు మోహన్‌బాబుగారూ, కోటాగారూ, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా .. అతిథి వస్తే అతిథిగానే ఉండాలని చెప్పారు.. అలాగే ఉంటాను అని చెప్పిరు. తెలుగుబిడ్డను, తెలుగువాడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గెస్ట్‌గా వస్తే గెస్ట్‌గానే ఉండాలని చాలా మంది చెప్పారు. ఇక నుంచి గెస్ట్‌గానే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం బాధతో తీసుకున్నది కాదు. నేను తెలుగు వాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. అది నా తప్పు కాదు.. నా తల్లిదండ్రుల తప్పుకాదు అని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన ఓటమికి ప్రాంతీయవాదంతో పాటు పలు కారణాలు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.