కరోనా వైరస్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
1. జ్వరం వస్తే రోగికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలి.
2. జ్వరం ఎక్కువగా ఉండి తల నొప్పి వస్తే నుదురుకి తడిగుడ్డతో కాపు పెట్టాలి. లేదా పట్టి వేసి పది నిముషాలకు ఒకసారి గుడ్డను మార్చాలి.
3, బలహీనం కాకుండా ors వాటర్ తాగించాలి.
4. మందులను సరైన సమయానికి వాడాలి.
5. బత్తాయి juice తినదగ్గ ఫ్రూట్స్, కివి, తినాలి.
6. వేడిచేసి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీరు రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. పదే పదే వేడినీరు తాగితే జ్వరం తగ్గదు. కంటి నుండి నీరు రావటం జరుగుతుంది. కడుపుబ్బరంగా ఉంటుంది. ఆకలి వేయదు.
7. పాలు, రొట్టె, మెత్తగా గుజ్జుగా వున్న ఆహారపదార్దాలు తిసుకోవాలి ఆహార పదార్థాలు తేలికగా జిర్ణం అయ్యేవిధంగా ఉండాలి.
8. బాగా నిద్రపోవాలి. సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే జ్వరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
జ్వరంలో ఉంటే ఆయిల్ ఫుడ్స్, నాన్ వెజ్, గోంగూర, తినరాదు. మైదాతో చేసిన పదార్దాలు తినరాదు.
వైరస్ వస్తే తీసుకోవాల్సిన ఆయుర్వేద మందులు.
1. సుదర్శన చూర్ణం లేదా సుదర్శన కాడ తీసుకోవాలి. (గర్భవతి, షుగర్ పేషెంట్స్ తప్ప )
2. ఓజాస్ ఆయుర్వేద ఇమ్మ్యూనిటి టాబ్లెట్స్
3.తిప్పతీగ కాషాయం ఉదయం పరిగడుపున తీసుకువాలి. తిప్పతీగ నాలుగు చిన్న కాడలు, ఒక గ్లాస్ నీటిలో వేసి పావు గ్లాస్ వరకు మరిగించి దానిని వడ పోసి తాగాలి. దీనిని తాగిన తరువాత గంట వరకు ఏమి తీసుకోవద్దు.
4 తులసి రసం టీ స్పూన్, తేనే టీ స్పూన్ కలిపి తీసుకోవాలి. జ్వరం వెంటనే తగ్గుముఖం పడుతుంది.
5.వాంతులు వస్తే అల్లం రసం టీ స్పూన్ మరియు తేనే టీ స్పూన్ కలిపి నాకాలి.
5. ఒళ్ళు నొప్పులు ఉంటే రుమాలయ టాబ్లెట్ లేదా యోగరాజ్ గుగ్గులు టాబ్లెట్ తీసుకోవాలి.
6. పొడి దగ్గు వస్తే తాళి సాధి చూర్ణం తీసుకోవాలి. జలుబు, జ్వరం, కాస, శ్వాస, తగ్గుతుంది.
7. ఆయాసం వస్తే స్వాశామృతం 15 ml సమానంగా నీళ్లు కలిపి తీసుకోవాలి. చిన్న పిల్లలకు, మరియు గర్భవతులు వాడే ముందు డాక్టర్ ని సంప్రదించండి.
8.గుండె దడ ఉంటే దశముల రిష్ట, అర్జున రిష్ట 10-10ml కలిపి తీసుకోవాలి.
9. ముక్కు జలుబుతో మూతపడి శ్వాస నడవకపోతే “అణు తైలం “రెండు ముక్కులలో రెండు చుక్కలు వేస్తే ముక్కులు విప్పుకొని శ్వాస బాగా నడుస్తుంది.
11. గొంతులో కిచ కిచగా ఉంటే అతిమధురం పౌడర్ ని ఆఫ్ టీ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి పావు గ్లాస్ అయినా తరువాత స్టవ్ నుండి దింపి వడ పోసి తాగాలి. (షుగర్ పేషెంట్స్ తాగరాదు.)
11. నల్ల జిలకర, వాము మూట.. సమానంగా 5-5గ్రాములు తీసుకొని ముఠా కట్టి ముక్కు దగ్గర పెట్టి వాసన చూడాలి. రోజుకు రెండు సార్లు మాత్రమే చేయాలి.
12. ఇవన్నీ ఆయుర్వేద డాక్టర్ గారి సలహా మేరకు వాడగలరు. ఎందుకంటే జ్వరం తీవ్రతను బట్టి ఆయుర్వేద మందులు చెప్పబడును.
వ్యాధినిరోధక శక్తి పెంచుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారనియమాలు
1. ఉదయం లేవగానే ఒక లీటర్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి గార్గ్లింగ్ చేయాలి. Bp ఉంటే నిమ్మరసం టీ స్పూన్ కలిపి దానిని తాగి వాంతి చేయాలి. లేదా గోరువెచ్చని నీటిని తాగి శంఖప్రక్షాళన చేయాలి. ఇది వారానికి ఒకసారి లేదా 45 రోజులకు ఒకసారి చేయాలి. మీ ఆరోగ్య స్థితిని బట్టి చేయాలి.
2.యోగసాధన చేయాలి. తెల్లవారుజామున కాలకృత్యములు చేసుకొని ఈ కింద ఆసనములు చేయాలి.
1. సూర్యనమస్కారములు 6 సార్లు
2.తాడాసనం 3 సార్లు
3. వజ్రాసనం 5 మినిట్.
4. శాశంకాసనం 3 సార్లు.
5. సుప్తవజ్రాసనం 3 సార్లు
6. ఉష్ట్రాసనం 3సార్లు
7. భుజాంగసనం 3 సార్లు.
8. శలాభాసనం 3 సార్లు.
9. మయూరాసనం 3 మినిట్
10. ఉత్తనాపాదాసనం 3 సార్లు
11. హలాసనం 3 సార్లు
12. చక్రాసనం లేదా సేతు బందాసనం 3 సార్లు
13. సర్వాంగాసానం 3 మినిట్
14.మత్స్యసనం 3 సార్లు
15. శవాసనం 10 నిముషాలు చేయాలి
ప్రాణాయామము
1.కపాలభాతి 10 మినిట్
2. అనులోమ విలోమము 30 సార్లు
3. ఉజ్జయిని 9 సార్లు
4. భ్రమరి 5 సార్లు
5. ప్రాణముద్ర 5 మినిట్
6. సింహాసనం
7. హాస్యాసనం చేసి ముగించాలి.
ఇమ్మ్యూనిటి కొరకు తినవాల్సిన పదార్దాలు.
1. బాదాం 2, అంజీరా 2, ఎండు ద్రాక్ష 10, ఎండు ఖార్జురం 2 ఇవన్నీ వేరు వేరు గా గ్లాస్ నీటిలో రాత్రి నానా పెట్టి ఉదయం తినాలి. ఒకవేళ ఉదయం నానా పెడితే రాత్రి నిదురించే ముందు తినాలి. బాదాం మీద పొట్టు తీసి తినండి. లేకపోతే చర్మ వ్యాధులు వస్తాయి.
2. ఆపిల్, కివి, అలుబకరా, ఊసిరి, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, నువ్వులుండలు,బత్తాయి,కమల పండు c విటమిన్ నిమ్మకాయ జాతి వున్న పండ్లు తినాలి.వాటి రసాలు తాగాలి.
3.విటమిన్ A, బి, డి, చాలా అవసరం. వాటి కోసం వెన్న, నెయ్యి, గుడ్లు, ముల్లంగి, క్యారట్, పాలకూర, మామిడి పండ్లు, దంపుడు బియ్యం, నువ్వులు, గోధుమలు, బియ్యం, సొయాభీన్స్, ప్రొద్దుతిరుగుడు గింజలు, శనగలు, ఇవన్నీ తీసుకోవాలి. డి విటమిన్ కొరకు ఉదయం సాయంత్ర సూర్యకిరణాలు శరీరం మీద పడేటట్లు చూసుకువాలి. వెలుతురు వున్న ప్రాంతంలో ఉండాలి. చక్కని ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.
4.మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత పలుచటి మజ్జిగలో కొద్దిగా ఉప్పు,మిర్యాల చూర్ణం చిటికెడు,పొదీన ఆకులు లేదా కోత్తిమీర ఆకులు కలిపి తాగాలి. మిర్యాలు ఆంటీ బయాటిక్ గా ఆంటీ వైరల్ గా పనిచేస్తుంది.
5. సాయంత్రం బత్తాయి juice లో చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తాగితే రుచికి ఆరోగ్యానికి చాలా చక్కగా ఉంటుంది. ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
6. లేదా క్యారట్ juice లో తేనే లేదా మిరియాల చూర్ణం కలిపి తాగిన సరే ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
7. లేదా ఏదైనా పండ్ల రసాలలో తేనే, నిమ్మరసం కలిపి తాగిన ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
8.ఆయుర్వేద కాషాయం.
ఇమ్మ్యూనిటి బూస్టర్
ఒక పెద్ద గ్లాస్ నీరు తీసుకొని దానిలో చిన్న అల్లం ముక్క, మూడు మిరియాలు మెత్తగా దంచిన పౌడర్. యాలుకలు రెండు దంచిన పౌడర్, తులసి ఆకులు 3, వీటిని బాగా మరిగించి పావు గ్లాస్ చేసి వడ పట్టి, దానిలో తగినంతగా తేనే కలిపి వేడి వేడి గా తాగాలి. ఇది ఇమ్మ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది.
1. అల్లం దగ్గు, శ్వాస, కఫాన్ని తగ్గిస్తుంది. చక్కగా పనిచేస్తుంది.
2. తేనే అనేక రోగాలకు నివారిస్తుంది. తేనే ప్రేవులకు శక్తినిస్తుంది. బలాన్ని ఇస్తుంది. విష క్రీములను సంహారిస్తుంది. దీర్ఘాకాలిక జలుబు, దగ్గు, జ్వరన్, పడిసం, తగ్గిస్తుంది ఛాతిలో పేరుకోపోయిన కపాన్ని తేలికగా చేసి బయటికి పంపిస్తుంది. ఆయాసం, పిల్లికూతలు,క్షయ, తగ్గిస్తుంది. మస్తీష్కమ్ చురుకుతనం పెంచుతుంది శారీరక, మానసిక, అలసటను దూరం చేస్తుంది.
3. తులసి ఆంటీ బయటిక్, ఆంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
4మిరియాలు ఆంటీ వైరల్ గా, చక్కగా పనిచేస్తుంది.
5. ఇలాయిచి ముత్రాన్ని జారగోడుతుంది.
-షేక్. బహార్ అలీ.
ఆయుర్వేద వైద్యుడు,
సెల్: 7395126557