గర్భాధారణ సమయంలో వేవిళ్లు..
స్త్రీలలో అతి సాధారణంగా కనిపించే సమస్య వేవిళ్ళు.50 శాతం స్త్రీలలో గర్భం వచ్చి, మొదటి నెల నుండి 4-5 నెలల వరకు వేవిళ్ళు ఉంటాయి. వేవిళ్ళు రావటానికి కొన్ని రకాల భయాలు కారణమైతే గోనడోట్రోఫీక్ హార్మోన్లు విడుదల కావటం. మరొక కారణం భయం, కంగారు విటమిన్లు B6 లోపం, కూడా ఇంకొక కారణం, ప్రయాణాలలో వేవిళ్ళు సమస్య ఎక్కువగా ఉంటుంది. మహా నగరాలలో ఉద్యోగ్యం చేసే మహిళలకు ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. కొత్తగా మొదటి సారి గర్భవతిగా వున్నపుడు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి.
ఈ వ్యాధి నివారణకు చిన్న ఒక చిట్కా..
1. వాంతులు, వికారాలు, ఏ ఆహారం తీసుకున్న సరే వెంటనే వాంతులు కావటం. లేదా వికారంగా ఉండటమో ఉంటాయి.
2. అలసట, నీరసం, నిద్ర పట్టకపోవటం, తలతిప్పటం, మొదలగున్నవి వ్యాధి లక్షణాలు.
చికిత్స
1.ధనియాలు చూర్ణం చిటికెడు, మరియు చిటికెడు పంచదార కలిపి బియ్యం కడుగు నీటితో త్రాగలి.
2. ఒక tea spoon తేనే మరియు ఒక tea spoon నిమ్మరసం కలిపి త్రాగించాలి.
-షేక్. బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు