వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌లో రాష్ట్రపతి, ప్రధాని

ఢిల్లీ (CLiC2NEWS): భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌కు దేశ రాష్ట్రపతి, ప్రధాని హాజరైనారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నిలయంలో వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. వేడుకకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడి హాజరైనారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఉపరాష్ట్రపతి కుమారుడు హర్షవర్దన్-రాధ దంపతుల కుమార్తె నిహారికకు హైదరాబాద్‌కు చెందిన రవితేజతో ఇటీవల వివాహాం జరిగింది. ఈ రిసెప్షన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్, పలవులు ఎంపిలు, మంత్రలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నాతాధికారులు హాజరైనారు.