ప్రతిష్టాత్మక అవార్డ్‌కు నామినేట్ అయిన క్రికెటర్ పంత్..

Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్..ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్‌కు నామినేట్ అయిన భారత్ నుండి రెండో వ్యక్తిగా అరుదైన ఘనతను సాధించాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో ‘కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి టీమ్ ఇండియా యువ ఆటగాడు పంత్ నామినేట్ అయ్యాడు. ఇంతకు ముందు భారత క్రికెటర్‌లో సచిన్ మాత్రమే ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏప్రిల్ 21న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో నిర్వహించనున్నారు.
రిసభ్ పంత్ 2022, డిసెంబర్ 30 న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని మోకాలికి శస్త్ర చికిత్స కూడా చేశారు. గాయాల నుండి కోలుకోవడానికి అతనికి 14 నెలల సమయం పట్టింది. తిరిగి 2024 ఐపిఎల్‌లో పంత్ మైదానంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా దుబాయ్ లో ఉన్నాడు.