సమతామూర్తి సన్నిధానంలో ప్రధానమంత్రి..

హైదరాబాద్(CLiC2NEWS): ప్రధానమంత్రి నరేంద్ర మోడి ముచ్చింతల్ చేరుకున్నారు. యాగశాలలో నిర్వహిస్తున్న విష్శక్సేనేష్టి యాగంలో మోడితో పాటు, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తదనంతరం 108 దివ్య దేశాల (వైష్ణవ ఆలయాలు) మోడి సందర్శించారు. అనంతరం రామానుజాచార్యుల విగ్రహాన్ని మోడి ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.