ప్రధాని మోడి వీడియో సమావేశం

హైదరాబాద్ (CLiC2NEWS): 75 వస్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం ప్రధాని నరేంద్రమోడి దేశంలోని ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం గతంలో ఏర్పాటైన జాతీయ కమిటి సభ్యులతో ప్రధానమంత్రి ఈరోజు సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, తదతర కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖలు వీడయో కాన్ఫరెన్స్ ద్వారాహాజరయ్యారు.
ఈ జాతీయ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి, రాష్ట్రల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తాలు, అధికారులు, మీడియా సంస్థల అధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, సినీరంగాలకు చెందిన ప్రముఖులకు స్థానం కల్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కెసిఆర్, జగన్, టిడిపి ఆధినేత చంద్రబాబు, రామోజి గ్రూప్ సంస్తల ఛైర్మన్ రామోజిరావు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.