నిర్మాత మహేశ్ కోనేరు మృతి

విశాఖపట్నం (CLiC2NEWS) : టాలీవుడ్ నిర్మాత మహేశ్ కోనేరు గుండెపోటుతో ఈరోజు హఠాన్మరణం చెందారు.
ఇవాళ ఉదయం విశాఖలోని తన స్వగృహంలో ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ తుది శ్వాసవిడిచారు. ఈయన 118, తిమ్మరుసు, మిస్ ఇండియా చిత్రాలకు నిర్మతగా వ్యవహరించారు. విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రాన్ని విజిల్ పేరుతో తెలుగులోకిడబ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు, కల్యాణ్‌రామ్‌కు వ్యక్తిగత పిఆర్‌గా పనిచేశారు. ఈయన మృతిపై సిని ప్రముఖులు సంతాపం తెలియజేశారు.