TS: ఘనంగా ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ సర్ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం, ఇతర అనుభంధ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు తొలి దశ నుండి మలిదశ వరకు ప్రతి ఒక పోరాటం లో కీలకమైన పాత్ర పోషిస్తూ తెలంగాణ సాధన తన జీవితాశయంగా పోరాటం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు అలుపెరుగకుండా శ్రమించిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. జయశంకర్ సర్ ఆశయాలను కొనసాగించఢానికి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పనిచేయాలని పేర్కొన్నారు. నిమ్స్ ఆస్పత్రిలోని అధికారి నుండి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పని చేస్తూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రొ.జయశంకర్ సర్ ఆశయాలను ఖచ్చితంగా కొనసాగించి తను కలలుగన్న రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు.




