సచివాలయాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు!
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామ, వార్టు సచివాలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా తొలి దశలో త్వరలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టబోతున్నట్టు సర్కార్ తెలియజేసింది. దీనికోసం గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.