అన్ని తానై సేవలందిస్తుంది మగువ..!

దినమంతా అలసిసొలసి ఇంటికి వచ్చిన నీకు

అన్ని తానై సేవలు అందిస్తుంది మగువ..!

నీ కనురెప్పల మాటున ..

దాగిన బాధకు వీడ్కోలు చెబుతూ

రేపటి జీవితపు ఉషోదయానికి ఆశల జాగృతి అవుతుంది మగువ..!

నీ బతుకు పూలబాటలో సాగినా ..

మెతుకుకై ముళ్ళ బాటలో నడిచినా ..

నీతో పాటు కలసి జీవిస్తుంది మగువ..!

మగువలను గౌరవించండి ఆమె కూడా

ఒక మనసున్న మనిషి అని తెలుసుకోండి .

-మంజుల పత్తిపాటి

1 Comment
  1. Earn Online says

    Wow, wonderful weblog format! How long have you ever been running a blog for? you make blogging glance easy. The full look of your site is great, let alone the content!!

Leave A Reply

Your email address will not be published.