జలమండలికి పిఆర్ఎస్ఐ జాతీయ అవార్డు…

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతుంది. పీఆర్ఎస్ఐ (పబ్లిక్ రిలేషన్స్ సోసైటీ ఆఫ్ ఇండియా) జాతీయ అవార్డ్ 2021 భాగంగా సోసైటీ నిర్వహించిన బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపైన్ (ఎక్స్టర్నల్) విభాగాల్లో జలమండలికి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. దేశ నలుమూలాల నుంచి ఎల్ ఆంట్ టి(L&T), ఎన్ఎమ్ డిసి (NMDC), ఐటీసీ(ITC), హిందూస్తాన్ పెట్రోలియం(Hindustan Petroleum), భారత్ పెట్రోలియం(Bharath Petroleum), ఎంటీపీసీ(NTPC) వంటి ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఇందులో పోటీపడగా జలమండలి ఇందులో జాతీయ స్థాయిలో ద్వితీయ విజేతగా నిలిచింది.
జీహెచ్ఎంసి పరిధి లో నివసిస్తున్న వినియోగదారులు 20 వేల ఉచిత తాగునీటి పథకం అందరికీ అందేలాగా జలమండలి వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించింది. జలమండలి ఆధ్వర్యంలో, శాస్త్రీయ పద్ధతి లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ గురించి పలు ఎన్జీవోలు, కార్యకర్తలకు శిక్షణా, అవగాహనా కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ఆ పథకాలకు సంబంధించి విషయాన్ని ఒక బ్రౌచర్లను సైతం రూపొందించింది. ఈ రెండింటిని పీఆర్ఎస్ఐ జాతీయ అవార్డులు 2021 లో భాగంగా ఏర్పాటు చేసిన పోటీలకు పంపగా జలమండలి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెల్చుకుంది. ఈనెల 28వ తేదీన వర్చ్యువల్ పద్దతిలో బహుమతుల ప్రధానోత్సవం జరగనుంది.
ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిషోర్ గారు హార్షం వ్యక్తం చేశారు. జలమండలి కమ్యూనికేషన్ క్యాంపైన్ విభాగంలో బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు. దీనికోసం కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.