పిఎస్ ఎల్ వి సి-54 ప్రయోగం సక్సెస్
9 ఉపగ్రహాలు కక్ష్యలోకి..

నెల్లూరు (CLiC2NEWS): నెల్లూరు జిల్లాలోని ఇస్రో (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్) ప్రయోగించిన పిఎస్ ఎల్ వి సి-54 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈప్రయోగం ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈ ప్రయోగం ద్వారా ఇఒఎస్ శాట్-6 సహా 8 నానో ఉపగ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి పిఎస్ ఎల్ వి సి-54 ద్వారా పంపించారు. ఈ ఉపగ్రహాల ద్వారా తుఫానులను పసిగట్టడం, సముద్రాల మీద అధ్యయనం, వాతావరణంలో తేడా, పంటనకు వచ్చే తెగుళ్లను గుర్తించడం వంటి వాటిపై అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతంపై ఇస్రోశాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.