దుర్యోధనుడి వేషధారణలో రాఘరామ.. బాలచంద్రుడిగా కందుల దుర్గేష్..

విజయవాడ (CLiC2NEWS): నగరంలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలలో పలువురు వివిధ వేషధారణలతో అలరించారు. ఉపసభాపతి రాఘరామకృష్ణరాజు దుర్యోధనుడి వేషధారణలో అలరించారు. దానవీర శూర కర్ణ సినిమాలోని ఎన్‌టిఆర్ డైలాగ్స్‌తో ఆయన ఏకపాత్రభినయం చేశారు. యలమంచిలి ఎమ్మెల్యే సందరపు విజయకుమార్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావులు హస్యనటనతో ఆకట్టుకున్నారు. పల్నాటి బాల చంద్రుడి వేష ధారణలో మంత్రి కందుల దుర్గేష్ అలరించి ప్రసంశలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ సహా సభ్యులంతా చప్పట్లతో అభినందించారు.