ఎపిపిఎస్‌సి ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా ఎవి రమణారెడ్డి

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(APPSC) ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా ఎవి రమణారెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న ఛైర్మన్ ఉదయభాస్కర్ పదవీ విరమణ చేయడంతో రమణారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎపి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన 2020 మార్చి 24నుండి APPSC సభ్యుడిగా సేవలందిస్తున్నారు.